cow-in-atm-tamilnaduడబ్బులను డ్రా చేసుకునే ఏటీఎంలను రకరకాలుగా వినియోగించడం సీసీ కెమెరాల సాక్షిగా వెలుగు చూసిన వైనం తెలిసిందే. ఏటీఎంలు ఏర్పాటు చేసిన తొలినాళ్ళల్లో రొమాన్స్ చేసుకోవడానికి ఉపయోగించుకున్న మానవ జాతి కంటే, సాధు జంతువైన ఆవులు సరైన దిశగా ఉపయోగించుకుంటున్నాయని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఉష్ణోగ్రతలు ఎప్పటి కంటే దాదాపుగా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడిమికి సాధారణ ప్రజానీకం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, మరి మూగ జీవాలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి అన్న దానికి నిదర్శనమే… ఈ ఏటీఎంల ఆవు దర్శనం.

ఎసిలతో ఉండే ఏటీఎం మెషీన్లో ఆవు సేదతీరుతూ కనపడడంతో ఏ రేంజ్ లో మూగ జీవాలు ఈ ఎండలను తట్టుకోలేకపోతున్నాయో అర్ధమవుతోంది. ఓటు హక్కు లేని ఈ మూగజీవాలను పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వాలకు లేకపోవడంతో ఎక్కడికక్కడ తమ గూడు కోసం ఇలా ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వాటి వంతవుతోంది. సమ్మర్ ఎఫెక్ట్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.