chiranjeevi brother Nagababu to join YSRCPచిరంజీవి కాంగ్రెస్ లో, పవన్ కళ్యాణ్ ‘జనసేన’లో ఉండడం… ఇద్దరు మెగా సోదరుల మధ్య బేదాభిప్రాయాలకు ఏర్పడడానికి కారణమయ్యాయి. ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ ఎడమొహం పెడమొహంగా ఉంటుంటే అభిమానులు కలత చెందుతున్నారు. అయితే రాజకీయంగా ఇవన్నీ సాధారణమే కాబట్టి రానూ రానూ మెగా అభిమానులు కూడా అలవాటు పడిపోయారు.

అయితే మరో సంచలమైన వార్త ఏమిటంటే… ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తన బ్లాగ్ లో పెట్టిన సమాచారం మేరకు… “మెగాస్టార్ చిరంజీవి మరో సోదరుడైన నాగబాబు కూడా రాజకీయాల వైపుకు మొగ్గు చూపుతున్నారని, దీనికి ఫ్లాట్ ఫాంగా వైసీపీని ఎంచుకున్నారని, ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు రాజకీయ పార్టీల్లో కొనసాగడం కామనే కాబట్టి, ‘జబర్దస్త్’ కార్యక్రమ సహనటి రోజా ద్వారా వైసీపీలో వెళ్ళడానికి నాగబాబు సిద్ధమయ్యారని, మరోవైపు నాగబాబు పార్టీలో చేరితే కాకినాడ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తానని జగన్ చెప్పినట్లుగా…” ఈ వార్తల సారాంశం.

ఇదే జరిగితే మెగా ఫ్యామిలీలో మరో సంచలన ఘటన చోటు చేసుకున్నట్టే. ఒక వైపు పవన్ వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతగా చిరంజీవి అధికార టిడిపి + బిజెపి కూటమికి (అంటే పవన్ వ్యతిరేక వర్గానికి) ప్రచారం చేస్తుండడం అలా ఉంచితే, వైసీపీ నేతగా నాగబాబు ఇటు కాంగ్రెస్ ను, అటు టిడిపి కూటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అపుడు ముక్కోణపు లవ్ స్టోరీల మాదిరే, ముక్కోణపు రివెంజ్ స్టోరీ మెగా కుటుంబంలో చోటు చేసుకుంటుందని అభిమానులు కలవర పడుతున్నారు. అయితే ఈ వార్తల్లో అసలు వాస్తవం ఎంత ఉందనేది తేలాల్సిన అంశం.