brahmotsavam leaked imagesశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు ముద్దుగుమ్మలతో మొదటిసారి మహేష్ నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కావడానికి ముస్తాబు చేస్తున్నారు. ప్రముఖ పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వెబ్ ప్రపంచంలో సందడి చేస్తున్నాయి.

సినిమా టైటిల్ ను ఆవిష్కరించే విధంగా నిజమైన బ్రహ్మోత్సవం జరుగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ ఫోటోలను ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక బ్రహ్మోత్సవంలా ఉంటుందని చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అందుకు తగిన విధంగానే సినిమా సెట్స్ ను రూపకల్పన చేసినట్లుగా కనపడుతోంది. కన్నుల పండుగగా దర్శనమిస్తున్న ఈ బ్రహ్మోత్సవపు నిజమైన దృశ్యాలు కావాలంటే మరికొద్ది మాసాలు వేచి చూడాల్సిందే.