brahmotsavam, first week collections, mahesh babu, samantha, kajal, srikanth addala, 40 crores club, tollywood, box office, PVP‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విడుదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్లు పైన కొల్లగొట్టిన ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్లకు చేరింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ (7.31 కోట్లు) సంఖ్యను చేరుకోగా, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలలో దాదాపు 5.50 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

అయితే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కూడా మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లే వసూలు అయ్యాయి. అయితే ఆ సినిమాను సూపర్ హిట్ అన్నారు, ఈ సినిమాను అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అవును… అది నిజమే… అనడానికి కూడా కారణాలు ఉన్నాయి..! మొదటి వారం తర్వాత కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరో 20 కోట్లను వసూలు చేసి, 50 కోట్ల క్లబ్ లో చేరింది. కానీ, ‘బ్రహ్మోత్సవం’ పరిస్థితి వేరు. ప్రస్తుత వస్తున్న రెవిన్యూను పరిశీలిస్తే… 40 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

అయినా ‘సీతమ్మ…’ సినిమాతో పోల్చుకుంటే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు చాలా ఖర్చు పెట్టారు. దాదాపు 15 రకాల సెట్స్, ఉత్తరాదిలో షూటింగ్ వంటి వలన బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. దీంతో మొదటి వారం కలెక్షన్స్ లో రెండు సినిమాలు మ్యాచ్ అయ్యాయి కానీ, పెట్టిన పెట్టుబడిలో గానీ, వచ్చిన టాక్ కు గానీ, ఎక్కడా ఈ రెండు సినిమాలకు పోలిక లేదు. అయితే దారుణమైన టాక్ వస్తేనే, ఒక సూపర్ హిట్ సినిమాతో సమానంగా కలెక్షన్స్ సాధించిన మహేష్ స్టామినాను ఎవరు తక్కువ వేయలేని పరిస్థితి!