Angurlata-Deka-Assam-BJP-MLAఅస్సాంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అంగూర్ లతా. హీరోయిన్ గా నటిస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ బ్యూటీకి గత జీవితానికి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఏకంగా రాంగోపాల్ వర్మ సైతం ఈ అమ్మడి ఫోటోలపై ట్వీట్ చేయడం మరింత పాపులారిటీ అయ్యేలా చేసింది. అయితే దీనిపై తాజాగా అంగూర్ లతా స్పందించారు.

“తనకు అందం దేవుడిచ్చిన వరమని, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా సమాజంలో మార్పు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని” స్పష్టం చేసారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న తీరుపై మండిపడ్డ అంగూర్… టెక్నాలజీ పరంగా ఎదిగిన భారత్, మానసికంగా మాత్రం ఎదగలేదని, తనపై చేస్తున్న ఈ ప్రచారం ఆపాలని విన్నవించుకున్నారు.

మార్స్ పై అడుగిడినా, మనుషుల మనస్తత్వాలు మాత్రం మారలేదని, తనను ప్రోత్సహించింది ప్రధాని మోడీయేనని, తనను హాట్ ఎమ్మెల్యే అనవద్దని కోరారు. ప్రజాప్రతినిధిగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండడంతో, తనకున్న ‘హాట్’ ముద్ర అవరోధంగా మారే అవకాశం స్పష్టంగా ఉండడంతో, దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన అంగూర్ మీడియా ముందుకు వచ్చి అందరినీ విజ్ఞప్తి చేసారు.