a-aa-trailer-talkత్రివిక్రమ్ మ్యాజిక్ సినిమాలను ఎంజాయ్ చేయని ప్రేక్షకులుండరు. అలాంటి త్రివిక్రమ్ సినిమాలంటే కంటెంట్ ఉన్న కధ, పంచ్ డైలాగ్ లు, ఆహ్లాదకరమైన కామెడీ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే త్రివిక్రమ్ తాజా చిత్రం “అ…ఆ…” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ చూసిన తర్వాత… త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మిస్ అయ్యాయని ఫీలవ్వడం ప్రేక్షకుల వంతవుతుంది.

కంటెంట్ ఉన్న కధలా కనపడుతున్న ‘అ…ఆ…’ ట్రైలర్లో నితిన్ పాత్ర అనసూయ రామలింగం కంటే సమంత పాత్ర ఆనంద్ విహారి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. ట్రైలర్లో కట్ చేసిన షాట్స్ లో మొత్తం కూడా సమంతనే డామినేట్ చేసింది. అలాగే కెరీర్ బెస్ట్ అభినయాన్ని ఈ సినిమాలో సమంత అందించినట్లుగా కనపడుతోంది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫోటోగ్రఫీ, లొకేషన్స్, త్రివిక్రమ్ టేకింగ్ అన్నీ ప్రేక్షకులకు చూసే కొద్ది చూడముచ్చటగా ఉన్నాయి.

సినిమాపై ప్రస్తుతం ఉన్న అంచనాలను మాత్రం రెట్టింపు చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయిన ఈ ట్రైలర్లో ఏదో మిస్ అయ్యిందన్న అనుభూతితో పాటు, త్రివిక్రమ్ ఏదో చూపించబోతున్నారన్న ఫీల్ ను కలిగించారు. క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా పక్కా హిట్ అందుకునే కళలు స్పష్టంగా కనపడుతున్నాయి.