ram charan true jetకమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించడంలో ‘మెగా’ ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా అన్న పదాన్ని ‘సార్ధకం’ చేస్తున్నారు ‘మెగా’ తనయుడు రామ్ చరణ్. తను చేసే సినిమాలు పక్కా కమర్షియల్ అంశాలతో నిండి ఉండడం తెలిసిన విషయమే. కళాత్మక సినీ రంగంలో ప్రస్తుతం ‘కమర్షియల్’ అన్న పదానికే ‘విలువ’ ఎక్కువని చెర్రీ సినిమాలు చెప్పకనే చెబుతుంటాయి. ఒక్క సినీ రంగమే కాదు, ‘మెగా హ్యాండ్’ ఉన్నటువంటి ‘ట్రూ జెట్’ వంటి ఇతర వ్యాపార లావాదేవిల్లోనూ ‘కమర్షియల్’ అన్న పదమే దూసుకెళ్తోంది.

ప్రయాణికుల మదిలో అత్యంత చెత్త విమానయాన సర్వీసులను అందిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన “ట్రూ జెట్,” డిసెంబర్ 1వ తేదీ నుండి హైదరాబాద్ – విజయవాడల మధ్య సర్వీసులను నిలిపి వేస్తున్నట్లుగా సదరు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్లే విమానాల్లో 80 శాతం వరకు అక్యుపెన్సీ ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేటపుడు కేవలం 40 శాతం అక్యుపెన్సీ ఉండడంతోనే తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది.

తాత్కాలికంగా విజయవాడకు సర్వీసులు నిలిపివేసినా, 2016 జూన్ లో మళ్ళీ సర్వీసులు ప్రారంభిస్తామని సూత్రప్రాయంగా సదరు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే, అతి త్వరలోనే హైదరాబాద్ నుండి గోవాకు కొత్త సర్వీసులు ప్రారంభించడానికి “ట్రూ జెట్” సిద్ధమవుతోందని సమాచారం.