kcr hitech arrangements for elections“హైటెక్” అన్న పదం వింటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని అప్ డేట్ చేసుకోవడంలోనూ, వినియోగించుకోవడంలోనూ చంద్రబాబుది అందె వేసిన చేయి అన్న విషయం తెలిసిందే. అలా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టి, ఎంతో మందికి ఉపాధి కలిగించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ కారణం చేతనే సోషల్ మీడియాలో చంద్రబాబుకు ఎవరికీ లేనంత ఫాలోయింగ్ ఉంటుంది.

ఇదిలా ఉంటే, త్వరలో రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపిని బలంగా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ కూడా ‘హైటెక్’ పుంతలు తొక్కడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యేక ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు, వాట్సప్ గ్రూపులు..ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని హైటెక్ హంగులతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిలైన ఓటర్లు, హైటెక్ ఉద్యోగులు వీరి పాత్ర చాలా కీలకం కావచ్చన్న విషయం గుర్తించిన టీఆర్ఎస్ తగిన విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందుకోసం ఓ ప్రత్యేక ఐటీ విభాగాన్ని కూడా పార్టీలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాల్ని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.