Srikanth Addala Telugu Directorప్రిన్స్ మహేష్ బాబుతో “బ్రహ్మోత్సవం” సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత కనుమరుగైన విషయం తెలిసిందే. మహేష్ లాంటి హీరో ఇచ్చిన అరుదైన అవకాశాన్ని శ్రీకాంత్ జారవిడుచుకున్నాడని విమర్శలు వ్యక్తం కావడంతో, ఆ తర్వాత సినీ అవకాశాలు దూరమయ్యాయి. అయితే సహజ చిత్రాల దర్శకుడిగా శ్రీకాంత్ కున్న స్పెషాలిటీ తెలియనిది కాదు.

అయితే శ్రీకాంత్ పైన ఉన్న నమ్మకంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ అవకాశాన్ని ఇచ్చారని గత కొన్నాళ్లుగా ట్రేడ్ వర్గాలలో ఓ విషయం చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే గీతా ఆర్ట్స్ సంస్థలో శ్రీకాంత్ సినిమా చేయడం ఖరారైనట్లుగా సమాచారం. హీరో ఎవరో ఇంకా తెలియదు గానీ, అల్లు అరవింద్ – శ్రీకాంత్ అడ్డాల జోడి అయితే పక్కా!