Nayanatara As Siddhamma In Sye Raa Narasimha Reddy (2)మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు మినహా, చిత్ర యూనిట్ లోని ఇతర ప్రముఖుల కాస్టింగ్ జన్మదినోత్సవాల సమయంలో పోస్టర్లు తప్ప ఇంకేమీ విడుదల చేయని “సైరా” యూనిట్ నుండి నయనతార పుట్టినరోజు సందర్భంగా షాక్ ఇచ్చే విధంగా మోషన్ పిక్చర్ ను విడుదల చేసింది. నయనతారను సిద్దమ్మగా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ మోషన్ పిక్చర్ లో మరోసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ లో నయనతార లుక్ చాలా గ్రాండ్ గా కనపడుతోంది. సాధారణంగా హీరోయిన్ల పుట్టినరోజులకు పోస్టర్లు తప్ప, ఇలా మోషన్ పిక్చర్, టీజర్లు విడుదల కావు. కానీ ‘సైరా’కు రిలీజ్ చేసారంటే, సినిమాలో ‘సిద్దమ్మ’గా నయనతార రోల్ ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ వీడియో చెప్పకనే చెప్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.