M-J-Akbar-Metoo-Campaignభారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎం.జె. అక్బర్‌ గతంలో సంపాదకుడిగా ఉన్న సమయంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొందరు మహిళా పాత్రికేయులు ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఆరోపణలు బాగా ఎక్కువ కావడంతో విదేశీ పర్యటన ముంగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఆయనను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ హై కమాండ్ కోరిందని సమాచారం. పలువురు విదేశీ పాత్రికేయులు కూడా ఎం.జె అక్బర్‌పై ఆరోపణలు చేయడంతో బీజేపీకు ఆయనతో రాజీనామా చేయించక తప్పలేదు.

గతంలో పలు పత్రికల్లో సంపాదకుడిగా పనిచేసిన ఎం.జె. అక్బర్‌… భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై కేంద్ర సహాయ శాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పంపిన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. మరోవైపు దీనిపై ప్రతిపక్ష పార్టీలో మోడీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి.