Narendra Modi - KCR-ఏక కాల ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు టిఆర్ఎస్ మద్దత్తు పలకనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలతో చర్చలు జరుపుతుంది భాజపా. తమ పార్టీ అభిప్రాయం అడిగినప్పుడు అటువంటి ప్రతిపాదనకు మద్దత్తు ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారట.

ఏకకాల ఎన్నికలు జరిగితే సోనియా, రాహుల్‌ గాంధీల శక్తి సామర్థ్యాలు తెలంగాణలో మాత్రమే కేంద్రీకరించడం కుదరదు కాబట్టి అది తమకు అడ్వాంటేజీగా మారుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. దీనివల్ల ప్రధాన ప్రతిపక్షంతో పెద్దగా ఇబ్బంది ఉండదు అని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరిగిన 102 సీట్లకు తక్కువ రావని ముఖ్యమంత్రి పార్టీ వర్గాలకు తెలిపారట. 2014 ఎన్నికల సమయంలో సర్వే చేసిన సంస్థతోనే సర్వే చేయించాం అని, గతంలో వారు ఇచ్చిన ఫలితాలు నిజమయ్యాయి కనుక ఈసారి కూడా నిజం అవ్వబోతున్నాయి అని సీఎం అభిప్రాయపడ్డారు.

మరోవైపు అటువంటి నిర్ణయం ఒప్పుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఏక కాల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి ఉంది. అటువంటి సందర్భంలో రాజ్యసభలో కాంగ్రెస్ మద్దత్తు అనివార్యం అవుతుంది. అటువంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ సహకరించే అవకాశం లేదని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.